సిరా న్యూస్,కాకినాడ;
ఏలేశ్వరం నగర పంచాయితీ లో ఓ వడ్డీ వ్యాపారి నిర్వాకం బయటపడింది. అప్పు తీసుకుని వడ్డీ చెల్లించడం లేదని ఇంటికి తాళాలు వేసి అప్పు తీసుకున్న వ్యక్తి ని, భార్యా పిల్లలును గృహ నిర్భందం చేసాడో వడ్డీ వ్యాపారి. ఇంట్లో నించి బయటకి వస్తే పెట్రోల్ పోసి తగల బెడతానంటున్నాడని బాధితుల ఆరోపణ. ఏలేశ్వరం నగర పంచాయితీ చెందిన యేల్చూరి శ్రీనివాసరావు, అదే గ్రామానికి చెందిన పొట్టా సత్యనారాయణ అనే వడ్డీ వ్యాపారి వద్ద ఇంటిపై అప్పు తీసుకున్నాడు. వడ్డీ సక్రమంగా కట్టడం లేదంటూ ఇంటి యజమాని శ్రీనివాసరావును తన కుటుంబంతో సహా గ్రహ నిర్భందం చేశాడంటూ, తనకు న్యాయం చేయాలని గృహ నిర్భంధం
నుంచే బాధితులు ప్రాదేయపడుతున్నాడు.