సిరాన్యూస్,ఆదిలాబాద్
ఫార్మాసి చేయని వారిపై చర్యలు తీసుకోవాలి: ఫార్మాసిస్ట్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్
ఫార్మాసి చేయని వారిపై చర్యలు తీసుకోవాలని ఫార్మాసిస్ట్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు అశోక్ అన్నారు. బుధవారం
ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవం సందర్బంగా ఫార్మాసిస్ట్ సంక్షేమ సంఘం ఆద్వర్యం లో అదిలాబాద్ జిల్లా రిజిస్టర్ ఫార్మాసిస్ట్ లు ఔషద నియంత్రణ అధికారిని కలిశారు. ఈసందర్బంగా పలు సమస్యలపై ఆమెకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు డి.కపిల్ కుమార్ , జిల్లా ట్రెసర్ మనోజ్, నేరడిగొండ మండల అధ్యక్షుడు ఇషకొద్దీన్ లు, జిల్లా వ్యాప్త ఫార్మాసిస్ట్ లు పాల్గొన్నారు