chigurumamidi: చిగురుమామిడి ఓటర్లలో మహిళలదే అగ్రస్థానం

సిరా న్యూస్, చిగురుమామిడి
చిగురుమామిడి ఓటర్లలో మహిళలదే అగ్రస్థానం
* పురుషులు 16533 మంది …మహిళలు 17098 మంది
* త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకం కానున్న మహిళ ఓటర్లు

గ్రామపంచాయతీ ఎన్నికల్లో మండలంలో మహిళాదే అగ్రస్థానం.చిగురుమామిడి మండలంలో ఉన్న 17 గ్రామాల్లో పురుషుల కంటే మహిళలు అత్యధికంగా ఉన్నారు.అధికార యంత్రాంగం వెల్లడించిన జాబితా ప్రకారం పురుషులు 16,533 మంది.
మహిళలు 17,098 మంది ఉన్నారు.గ్రామాల వారిగా ఓటర్ల వివరాలు బొమ్మనపల్లి పురుషులు 1620, మహిళలు 1714. చిగురుమామిడి పురుషులు 1693,మహిళలు 1894 , గాగిరెడ్డిపల్లి పురుషులు 689, మహిళలు 646. గునుకులపల్లి పురుషులు 280, మహిళలు 281.ఇందుర్తి పురుషులు 1585, మహిళలు 1589. కొండాపూర్ పురుషులు 974, మహిళలు 980. లంబాడిపల్లి పురుషులు 495,మహిళలు 518. ముదిమాణిక్యం పురుషులు 788, మహిళలు 855, చిన్నముల్కనూర్ పురుషులు 1005, మహిళలు 1080. నవాబ్ పేట పురుషులు 1414, మహిళలు 1412, ఒగులాపూర్ పురుషులు 520, మహిళలు 542. పీచుపల్లి పురుషులు 258, మహిళలు269, రామంచ పురుషులు 820, మహిళలు 833. రేకొండ పురుషులు 1930, మహిళలు 2015, సీతారాంపూర్ పురుషులు 489, మహిళలు 515. సుందరగిరి పురుషులు 1364, మహిళలు 1341.ఉల్లంపల్లి పురుషులు 609, మహిళలు 605.మొత్తం ఓట్లు 33, 632, ఈనెల 28న గ్రామపంచాయతీలో తుది జాబితాను ప్రదర్శించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *