సిరా న్యూస్,విజయవాడ;
హీరోయిన్ జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు నిండా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. పరారీలో ఉన్న ఏ వన్ కుక్కల విద్యాసాగర్ ను పోలీసులు డెహ్రాడూన్‌లో పట్టుకుని విజయవాడకు తీసుకు వచ్చి రిమాండ్ కు తరలించారు. రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. కుక్కల విద్యాసాగర్ తో కలిసి ఐపీఎస్‌లు కుట్ర పన్ని జెత్వానీపై తప్పుడు కేసులు పెట్టారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా ఎఫ్ఐఆర్లో ఆ ముగ్గురి పేర్లు చేర్చినప్పటికీ వారి మెడకు ఉచ్చ బిగుసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే విద్యాసాగర్ కోసం ఆ ఐపీఎస్‌లు ఇదంతా చేయలేదని.. అప్పటి ప్రభుత్వ ముఖ్యసలహాదారు సజ్జల ప్రమేయంతోనే ఈ తతంగమంతా నడిచిందంటున్నారు.ముంబయి సినీనటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను డెహ్రాడూన్ నుంచి రైలులో అర్ధరాత్రి తీసుకొచ్చిన పోలీసులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షల అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ క్రమంలోనే పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌ని కోర్టుకు సమర్పించారు. ఆ రిపోర్ట్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారులు పి.సీతారామాంజనేయులు , కాంతిరాణా తాతా, విశాల్ గున్నీని నిందితులుగా చేర్చారు.వారితో పాటు అప్పట్లో విజయవాడ వెస్ట్‌జోన్ ఏసీపీగా పనిచేసిన హనుమంతురావు, ఇబ్రహీంపట్నం సీఐగా ఉన్న సత్యనారాయణలను కూడా నిందితులుగా చేర్చారు. విద్యాసాగర్‌తో అధికారులు కుమ్మక్కైనట్లు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ఐదుగురిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఎఫ్ఐఆర్లో ఇంకా సీతారామాంజనేయులు , కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ పేర్లు చేర్చలేదు. నేడో, రేపో ఆ ముగ్గురి పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చి అరెస్టులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.అరెస్టు భయంతో ఐపీఎస్ అధికారి కాంతిరాణా టాటా ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. తనపై తప్పుడు కేసు పెట్టారని.. తాను జెత్వానీ విషయంలో నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించానని కాంతి రాణా టాటా తన పిటిషన్లో పేర్కొన్నారు. మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ ఇంకా ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోలేదు.పి.సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్‌గున్నీ వై నేత కుక్కల విద్యాసాగర్‌తో కుమ్మక్కై కాదంబరీ జెత్వానీని అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. మరోవైపు కుక్కల విద్యాసాగర్‌కు వచ్చే నెల 4 వరకు జడ్జి రిమాండ్ విధించగా విజయవాడ సబ్ జైలుకు తరలించారు. అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ కేసులో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ముంబైకి చెందిన కాదంబరి జెత్వానీని గత ఫిబ్రవరిలో పోలీసులు అరెస్టు చేశారు. ఓ హీరోయిన్ ను అరెస్టు చేసి తీసుకు వచ్చినా ఎవరికీ తెలియదు. అత్యంత రహస్యంగా అరెస్టు చేసి తీసుకు వచ్చారు. దాదాపుగా నెలన్నర పాటు ఆమెను రిమాండ్ లో ఉంచారు. ఈ లోపు ముంబైలో ఆమె పారిశ్రామిక వేత్త జిందాల్‌పై పెట్టిన కేసులో.. పోలీసుల ఎదుట హాజరు కాలేకపోవడంతో ఆ కేసును కొట్టి వేశారు. ఇందు కోసమే ఆమెను అరెస్టు చేశారని.. జిందాల్‌ను రక్షించడం కోసం.. ఇదంతా చేశారన్న ఆరోపణలను జెత్వానీ చేస్తున్నారు. తనను అక్రమ కేసులో అరెస్టు చేసి వేధించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.జెత్వానీపై కేసు నమోదు చేయడానికి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. తనకు తప్పుడు పత్రాలతో భూమి అమ్మారని కుక్కల విద్యాసాగర్ అప్పట్లో చేసిన ఫిర్యాదు మేరకు ఆమెను అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అసలు జెత్వానీ ఎవరికీ భూమి అమ్మకానికి పెట్టలేదని.. ఎవరికీ ఆమె డబ్బులివ్వలేదని తాజా విచారణలో తేలింది. ఆమెపై ఫిర్యాదులో కుక్కల విద్యాసాగర్ పేర్కొన్న వ్యక్తులే ఈ విషయాన్ని విచారణాధికారులకు చెప్పారు. తమకు జెత్వానీతో ఎలాంటి పరిచయం లేదని ఆమె .. స్థలం అమ్మజూపలేదని స్పష్టం చేశారు. ఇలా జెత్వానీపై తప్పుడు కేసు పెట్టడం కోసమే అందరూ కలిసి ఓ ముఠాగా ఏర్పడి వేధించారని తేలడంతో.. కేసులు పెట్టారు.అయితే జెత్వానీ లాంటి సెలబ్రిటీపై విద్యాసాగర్ కేసు పెట్టడం.. దానికి ఐపీఎస్‌లు సహకరించడం వెనుక అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రధానంగా ఫోకస్ అవుతోంది. ముంబై పారిశ్రామికవేత్త జిందాల్ కోసం జగన్ ఆదేశాల మేరకే సజ్జల కాదంబరీ విషయంలో చక్రం తిప్పారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో సమగ్ర విచారణ పూర్తైతే ముగ్గురు ఐపీఎస్‌లతో పాటు సజ్జల కూడా జైలు పాలు కావడం ఖాయమంటున్నారు. ఆ భయంతోనే సజ్జల అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారన్న టాక్ వినిపిస్తుంది.