నలుగురు అరెస్టు
సిరా న్యూస్,వికారాబాద్;
చౌడపూర్ మండల కేంద్రంలో కుళ్లిన పదార్థాలతో కల్తీ అల్లం మరియు వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా ను జిల్లా టాస్క్ ఫోర్స్, పరిగి పోలీస్ అధికారులు పట్టుకున్నారు.
పోలీసులకు అందిన సమాచారం మేరకు చౌడాపూర్ మండల కేంద్రంలోని శశిధర్ కిరాణా దుకాణంలో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ అమ్ముతున్నారు అని, తెల్సుకొని కిరాణం దుకాణం లో చెక్ చేసారు. నకిలీ, కల్తీ అల్లం వెల్లుల్లి డబ్బాలు దొరికాయి. షాప్ యజమానిని విచారించగ అతను మహబూబ్ నగర్ లోని బాలకృష్ణ, వెంకటేశ్వర్లు ద్వారా కొనుగోలు చేసానని చెప్పాడు. బాలకృష్ణ, వెంకటేశ్వర్లు లను అదుపులోకి తీసుకుని విచారించారు. కీసర మండలం లోని దామోదర్ రెడ్డి దగ్గర తీసుకున్నామని వెల్లడించారు. వెంటనే దామోదర్ రెడ్డిని తీసుకోని విచారించి కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నా ముకుంద జింజర్ , గార్లిక్ పేస్ట్ ఇండస్ట్రీ పైన రైడ్ చేయగా సుమారు 200 కిలోల కుళ్ళిపోయిన నాసిరకం అల్లం,వెల్లుల్లి పేస్ట్, తయారీకి ఉపయోగించే సిట్రిక్ యాసిడ్, ఏసిటిక్ యాసిడ్ మరియు టెస్టింగ్ సాల్ట్ లను స్వాధీనం చేసుకున్నారు. . కుళ్ళిపోయినా, వివిధ కెమికల్స్ వేసి తయారు చేసిన మొత్తం 938 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్, 200 కేజీల కుళ్ళిపోయిన ఎల్లిపాయలు మొత్తం 1138 కేజిలు టాస్క్ ఫోర్స్ టీం అధికారులు స్వాధీనం చేసుకొని కుల్కచర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నిందితులు శశిధర్, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, దామోదర్ రెడ్డి లను రిమాండ్ కు తరలించారు. .