ఆదమరిస్తే అంతే సంగతులు
– పట్టించుకోని స్థానిక పోలీస్ శాఖ అధికారులు
సిరా న్యూస్,పరవాడ;
లంకెలపాలెం నుండి పరవాడ వచ్చే ప్రధాన రహదారిపై పరవాడ కొండ మలుపు దగ్గర గత వారం రోజులు నుంచి బొగ్గు లారీ ఆగిపోయి ఉంది.ఆగిన లారీ పరవాడకి వచ్చే రోడ్డుకి సరిగ్గా కటింగ్లో ఈ లారీ ఆగిపోయి ఉండడంతో అటుగా ప్రయాణించే వాహనాలకు,ప్రయాణికులకు,ఫార్మా సిటిలో పని చేస్తున్న కార్మికులకు,ఉద్యోగలకు చాలా ప్రమాదకరంగా మారింది.రాత్రి సమయంలో ఫార్మా సిటీ రహదారి కొంత మేరకు తప్ప మిగతాది అంతా చిమ్మ చీకటిగా ఉంటుంది.ఆ మలుపులో లారీ ఆగి ఉంది అని అటుగా ప్రయాణించే వాహనాలు కాని ప్రయాణికులు కాని గమనించకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు కొల్పయే అవకాశం ఉంది. ఇదే ప్రాంతంలో మునుపు చాలా ప్రమాదాలు జరిగాయి ప్రయాణికులు గాయాలుపాలు అయ్యారు ప్రాణాలు కూడా కొల్పయారు.దీనిపై పోలీస్ శాఖ వారు వెంటనే స్పందించకపోతే చాలా పెద్ద ప్రమాదానికి కారకులు అవ్వుతారని ఆ వాహనాన్ని అక్కడ నుంచి తియ్యపించే చర్యలు తీసుకోవలిసిందిగా అటుగా ప్రయాణించే ప్రయాణికులు,ప్రజలు కోరుతున్నారు.