సిరాన్యూస్, బేల
బేల మండల విద్యాధికారిగా కోలా నర్సిములు
పాఠశాలల పనితీరు మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మండల విద్యాధికారులు లేక గాడి తప్పిన పాఠశాలలపై ఆజమాయిషీ పెంచేందుకు మండలాలకు పూర్తి అదనపు బాధ్యతలు కలిగిన మండల విద్యాధికారులు,మండల నోడల్ అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సీనియర్ ప్రధాన ఉపాధ్యాయులు అయినా కోలా నర్సిములుని ఎఫ్ఏసి మండల విద్యాధికారిగా నియమించారు.ఈ సందర్బంగా ఆయన మండలంలో ఇంతకు ముందు ఎంఈఓ గా పనిచేసిన శ్రీనివాస్ నుండి బాధ్యతలు చేపట్టారు. అనంతరం కోలా నర్సిములుకు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,పలువురు ఉపాధ్యాయులు,యం ఆర్ సి సిబ్బంది శాలువాతో సత్కారించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా కోలా నర్సిములు మాట్లాడుతూ మండలంలో విద్యభివృధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.అదేవిధంగా ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ పథకాలు, మధ్యాహ్న భోజనం, ఉపాధ్యాయుల హాజారు శాతం,పదో తరగతి ఫలితాలు మెరుగుపర్చడానికి కృషి చేస్తానని చెప్పారు.