సిరా న్యూస్,కమాన్ పూర్;
మహమ్మద్ ప్రవక్త బోధనలు
ఆచరణీయమని ఆయిషా సిద్దిఖా- మహిళా విభాగం ఉద్యమ కన్వీనర్ అన్నారు. సెంటినరీ కాలనీ లో జరిగిన రామగిరి, పాలకుర్తి, రామగుండం, ముత్తారం, ఓడేడు,మండల ఇంచార్జిల సమావేశంలో వారు మాట్లాడుతూ ముస్లింల కోసమే కాకుండా
సర్వమానవాళికి రుజమార్గం చూపేందుకు ప్రవక్త ప్రయత్నించారని అన్నారు. ఆయన బోధనలు మానవాళికి దిశానిర్దేశం చేశాయన్నారు. పేదలను ప్రేమించడం, మహిళల పట్ల గౌరవంగా ఉండాలని తెలిపరు. కార్మికవర్గం హక్కులపై కూడా తన బోధనలో పొందుపర్చారనీ వెల్లడించారు. కార్మికున్ని కూలికి తీసుకున్నప్పుడే తన కూలిని నిర్ణయించాలని, పనిచేసిన తర్వాత శ్రమకు తగిన వేతనాన్ని చెల్లించాలని ప్రవక్త తనబోధనల్లో క్లుప్తంగా వివరించారని తెలిపారు. అడపిల్ల చదువుకోవాలని, ఇంట్లో మహిళ విద్యవంతురాలు అయితే, ఇంటిల్లిపాదీ విద్యావంతులు అవుతారని తెలుపడం జరిగిందన్నారు జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమాలను చేపట్టనున్నామనీ తెలిపారు.ఈనెల
30వరకు జరగనున్న ప్రచార ఉద్యమాలను విజయవంతం చేయా లని క్వాజీ ముహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ – వైస్ ప్రెసిడెంట్ – జమాత్ ఇ ఇస్లామీ హింద్ – ఉద్యమ కన్వీనర్ పి లుపునిచ్చారు-
అబ్దుల్ రజాక్ , అహమ్మద్ పాషా , పీరన్ సాహెబ్, అజీమ్, ఫర్జానా షాజహాన్ పాల్గొన్నారు.