సిరా న్యూస్,కొత్తగూడెం;
నేటి యువతరం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.శుక్రవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు సందర్భంగా చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని, అయనను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. స్వాతంత్ర్య సమర యోధుడుగా, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్య పాత్ర పోషించారని అన్నారు. వారి సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 1969వ సంవత్సరంలో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అండగా దీక్షను చేయడమే కాకుండా తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమానికి అండగా నిలిచిన మహనీయులని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై పోరాడిన యోధుడు తనకంటూ ఏమి లేకుండా బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తన ఆస్తులు దానం చేసిన త్యాగశీలి అని కొనియాడారు. ఆయన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు, బడగు బలహీన వర్గాల అభివృద్దికి కృషి చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సేవలను గుర్తించి అనేక కార్యక్రమాలను అధికారికంగా జరపడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ అధికారి బి ఇందిరా, ఎల్ డి ఎం రామ్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ అధికారి వేల్పుల విజేత, కలెక్టరేట్ ఏవో రమాదేవి,బి.సి. సంఘ నాయకులు కొదుమూరి సత్యనారయణ , మోతుకురి ధర్మారావు , చిప్పా శ్రీనివాస రావు , గుమలాపురం సత్యనారయణ , కలెక్టరేట్ సిబ్బంది ,తదితరులు,
పాల్గొన్నారు.