సిరాన్యూస్, కళ్యాణదుర్గం
మహేష్ కుటుంబానికి రూ.2లక్షలు అందజేత : ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ బద్దేనాయక్
శెట్టూరు మండలం కైరేవు గ్రామానికి చెందిన మహేష్(36)అనారోగ్యంతో వారం క్రితం మరణించారు. కుటుంబ పెద్ద మరణించాక వారి కుటుంబం చాలా దయనీయ స్థితిలో ఉంది. ఇతనికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మహేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ కు గ్రామస్తులు విన్నవించారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 2లక్షలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. రూ. 2లక్షలు మహేష్ కూతురైన జాహ్నవి పేరుమీద పోస్ట్ ఆఫీస్ లో 5ఏళ్ళ కాలానికి డిపాజిట్ చేయించారు. శుక్రవారం కుటుంబ సభ్యులకు ఖాతా పుస్తకాలను గ్రామస్తుల సమక్షంలో ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ బద్దేనాయక్ అందించారు.కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ ఛైర్మెన్ సురేష్,ట్రెజరర్ అబ్దుల్ వాహబ్ సెక్రటరీ హరి,సభ్యులు తిప్పేస్వామి, సాయినాథ్ హనుమంతరాయుడు యువకులు తిమ్మరాజు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.