ఇద్దరు మృతి
సిరా న్యూస్,యాదాద్రి భువనగిరి;
చౌటుప్పల్ మండలంలోని ఎల్లం బావి గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఆగి ఉన్న శ్రీకృష్ణ ప్రవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 11 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హైదరాబాదులోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటన సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. చనిపోయిన మృతదేహాలను చౌటుప్పల్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. చనిపోయిన ఇద్దరు ప్రయాణికులు ఖమ్మం జిల్లాలోని ఇల్లందు కు చెందిన సతీష్ కుమార్ (55) తేజ (24)గుర్తించారు. పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.