సిరాన్యూస్, ఆదిలాబాద్
మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్ పట్టణంలో నీటి ఎద్దడి తగ్గించేందుకు కృషి చేస్తున్నామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని వాల్మీకి నగర్ లో అమృత పథకం లో భాగంగా రూ.10 లక్షల లీటర్ల కెపాసిటీ తో మంచినీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ప్రస్తుతమున్న కోటి లీటర్ల ఓహెచ్ఎస్ఆర్ తోపాటు మరో కోటి లీటర్ల ఓహెచ్ఎస్ఆర్ సామర్థ్యం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు అమృత్ పథకం లో భాగంగానే ఇవ్వనుంది అన్నారు. అదిలాబాద్ పట్టణానికి సంబంధించిన మురికి నీరంతా చెరువులలో, లాండసాంగీ, అనుకుంటా, భీమ్ సరి వాగు లో కలుషితం అవడంతో మీరు తాగేందుకు ఇబ్బంది అవుతుందన్నారు. ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం కోసం స్థలాలను సైతం ఎంపిక చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కమర్ హైమాద్, బీజేపీ నాయకులు లాలా మున్నా, ఆకుల ప్రవీణ్, జోగు రవి, దయాకర్, బుమరెడ్డి, రాజూ, రఘుపతి, భరత్, రము, కృష్ణారెడ్డి చారి ముకుంద్ రెడ్డి, తదితరులు ఉన్నారు