సిరాన్యూస్, ఆదిలాబాద్
గోలి శంకర్ మృతి పార్టీకి తీరని లోటు : మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్
బి ఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త గోలి శంకర్ మృతి కార్యకర్తలను తీవ్ర మనస్థాపానికి గురి చేసిందనీ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. శనివారం మహాలక్ష్మి వాడాలో ఏర్పాటుచేసిన పెద్దకర్మ కార్యక్రమంలో గోలి శంకర్ ను స్మరించుకుంటూ శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి, కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తో పాటు బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ గోలి శంకర్ చిత్రపటం వద్ద పూలను సమర్పించి ఆయనను స్మరించుకున్నారు.గోలి శంకర్ తో ఉన్న స్నేహపూర్వ సంబంధాన్ని స్థానికులతో పంచుకొని బాద సప్త హృదయంతో నివాళ్లను అర్పించారు. ఆయన లేని లోటు పార్టీకి తీరని లోటని గోలి శంకర్ అమర్ హై అంటూ నినాదాలు చేస్తూ స్మరించుకున్నారు కార్యక్రమంలో రోకండ్ల రమేష్ , ఇజ్జగిరి నారాయణ రంగినేని శ్రీనివాస్, పందిరి భూమన్న, దమ్మ పాల్, కొండా గణేష్.చిన్న సాయి, బుచ్చక్క తదితరులు పాల్గొన్నారు.