సిరాన్యూస్, ఓదెల
ఈనెల29న ఉచిత కంటి పరీక్షల శిబిరం : సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మచారినేత
పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29న ఎల్విపి వారి సహకారంతో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహిస్తున్నట్లు సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి డాక్టర్ భీష్మచారినేత ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఓదెలలోని లక్ష్మి ప్రసన్న ఫంక్షన్ హాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.