విహెచ్పి నిరసన
సిరా న్యూస్,మల్కాజిగిరి : తిరుపతి లడ్డు లో జరిగిన కల్తీ విషయాన్ని నిరసిస్తూ మల్కాజిగిరి లో విశ్వహిందూ పరిషద్ అధ్యర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం వైదొలగి దేవాలయాలను ధార్మిక సంస్థలకు అప్పజెప్పాలని, హిందు దేవాలయాలలో అన్యమతస్తులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషద్ కార్యకర్తలు, హిందు సంఘాలనేతలు పాల్గొన్నారు.