హైడ్రాపై హైకోర్టులో విచారణ

వర్చువల్గా హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్
కోర్టులో హాజరై వివరణ ఇచ్చిన అమీన్పూర్ తహసీల్దార్
 సిరా న్యూస్,హైదరాబాద్;
హైడ్రాపై సోమవారం నాడు ఉదమయం హైకోర్టులో విచారణ జరిగింది. హైడ్రా కమిషనర్ రంగనాధ్ వర్చువల్ గా హజరయ్యారు. అమీన్ పూర్ తాహశీల్దార్ కోర్డుకు హజరయ్యారు. శని, ఆదివారాలు, సూర్యాస్తమయం తర్వాత చట్టప్రకారం కూల్చివేతలు ఎందుకుని హైకోర్టు ప్రశ్నించింది. సెలవు దినాల్లో ఎందుకు నోటీసులు ఇచ్చి, అత్యవసరం కూల్చాల్సి వస్తోందని ప్రశ్నించింది. శని, ఆదివారాల్లో కూల్చివేయొద్దని గతంలో కోర్టు తీర్పులున్నాయి. ఆ విషయం కూడా తెలియదా అని తహసీల్దార్ను ప్రశ్నించింది. ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా ఇల్లు కూల్చివేయాల్సిన అవసరం ఏముందని నిలదీసింది. ఈ కేసుపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చినట్లు తెలియదా అని ప్రశ్నించింది. పని దినాల్లో కాకుండా సెలవు దినాల్లో ఎందుకు కూల్చివేస్తున్నారని ప్రశ్నించింది. గతంలో ఇదే హైకోర్టు మీరు కూల్చివేసిన కేసుపై స్టే విధించిన విషయం తెలియదా అని ప్రశ్నించింది. చట్టప్రకారం నడుచుకోకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంద్నని తహసీల్దార్ను హెచ్చరించింది. రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చెప్పినంత మాత్రాన అక్రమంగా ముందుకు వెల్లొద్దని సూచించింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇచ్చారా అని హైకోర్టు అడిగింది. చనిపోయే వ్యక్తిని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని హైకోర్టు గుర్తు చేసింది. ప్రభుత్వ ఆస్తుల రక్షణ పేరుతో అమాయకులను ఇదే విధంగా ఇబ్బందులకు గురిచేస్తారా అని తహసీల్దార్ను ప్రశ్నించింది. ఆదివారం కూల్చివేయొచ్చా అని హైడ్రా కమిషనర్ను ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని రంగనాథ్కు సూచించింది. అక్రమ కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బంది ఇవ్వాలని కోరడంతో ప్రొవైడ్ చేశామపి రంగనాథ్ వివరణ ఇచ్చారు. చార్మినార్ కూల్చివేతకు తహసీల్దార్ యంత్రాలు, సిబ్బంది అడిగితే ఇస్తావా అని హైకోర్టు ఆడిగింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళితే స్టే ఇవ్వాల్సి వస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పండి.. మీరు చట్టాన్ని ఉల్లగించి కూల్చివేతలు చేస్తున్నారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *