సిరాన్యూస్, ఓదెల
జీలకుంటలో వినాయక స్థలం కబ్జా ....కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి వినతిపత్రం
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామంలో గత 30 సంవత్సరాలుగా వినాయక, దుర్గామాత విగ్రహాలను స్థాపించి ఉత్సవాలు జరుపుకునే స్థలాన్ని ఇటీవల ఆకునూరి రాజయ్య ఆక్రమించుకొని ఆటంక పరుస్తున్న విషయమై గ్రామంలోని కాలనీకి చెందిన పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఆటంక పరుస్తున్న వ్యక్తిపై చర్యలు గైకొనాలని కోరుతూ స్థానిక నివాసులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలోని అంబేద్కర్ కాలనీ కూడలిలోని సర్వే నంబర్ 563/2 లో గత 30 సంవత్సరాలుగా రేకుల షెడ్డు వేసుకొని ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ,అయితే కాలనీకి చెందిన ఆకునూరి రాజయ్య ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి తమను ఆటంక పరుస్తున్నారని , ఈ విషయమై స్థానిక రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. అతను ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేయడమే కాకుండా కాలనీవాసులు స్వచ్ఛందంగా ఉత్సవాల కోసం నిర్మించుకున్న రేకుల షెడ్డును కూల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ,దీనిని నిరోధించడానికి చర్యలు చేపట్టవలసిందిగా వారు వినతిపత్రంలో కోరారు. జీలకుంట గ్రామం లో అంబేద్కర్ కాలనీ కూడలిలో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాన్ని నిరోధించాలని , ప్రభుత్వ భూమిని కాపాడి సామాజిక అవసరం కోసం కాలనీవాసులు వినియోగించు కునేలా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈకార్యక్రమంలో బీజేపీ నాయకులు చర్లపల్లి రాజు గౌడ్, రౌతు జలపతి, బంగారి లింగయ్య, ధార సతీష్, ఆరెల్లి చేరాలు, బంగారి సారయ్య భోంగొని తిరుపతి గౌడ్, ధార విజేందర్ గోపగాని సతీష్ , తదితరులు ఉన్నారు.