సిరాన్యూస్, ఓదెల
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని పరామర్శించిన ఎమ్మెల్యే విజయరమణ రావు
రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ని పెద్దపల్లి శాసన సభ్యులు చింతకుంట విజయరమణ రావు మంగళవారం హైదారాబాద్ లోని మంత్రి నివాసంలో కలిసి పరామర్శించారు. మంత్రి తండ్రి పురుషోత్తం రెడ్డి మృతికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన చిత్ర పటానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే పూల మాల వేసి నివాళులు అర్పించారు.