సిరా న్యూస్,శ్రీశైలం;
శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబరు 3 నుండి 12వ తేదీ వరకు దసరా మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక శాసనసభ్యుడు బుడ్డా రాజశేఖరరెడ్డికి ఆహ్వానపత్రికను అందజేసి ఉత్సవాలకు ఆహ్వానించడం జరిగింది. కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, అర్చకస్వాములు, వేదపండితులు వేల్పనూరు నందు గౌరవ శాసనసభ్యుడిని కలిసి దసరా మహోత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమములో ఎమ్మెల్యేకు వేదాశీర్వదనంతో శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేయడం జరిగింది.