MLA Vedma Bojju Patel: అధికారులు ప్రజల సమస్యల పరిష్కారం కృషి చేయాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

సిరా న్యూస్, ఖానాపూర్‌
అధికారులు ప్రజల సమస్యల పరిష్కారం కృషి చేయాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.మంగళవారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆర్అండ్.బి,ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాలలో నెలకొన్న రోడ్డు,నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికారులు సైతం గ్రౌండ్ లెవల్ లో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలతో మమేకమౌతు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఏ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకొరావాలని,ఆ సమస్యల పరిష్కారం కోసం తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్.అండ్.బి, ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *