సిరాన్యూస్, కడెం
మహాత్ముడిని స్ఫూర్తి తీసుకోవాలి : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
మహాత్ముడిని స్ఫూర్తి తీసుకోవాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్అన్నారు. నిర్మల్ జిల్లా కడెం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమంలో ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ గాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడారు. మహాత్మా గాంధీ ని ఆదర్శం గా తీసుకోని అహింస మార్గం లో నడవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పొద్దుటూరి సతీష్ రెడ్డి, మండల అధ్యక్షులు తుమ్మల మల్లేష్ యాదవ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వాజీద్ ఖాన్, సింగల్ విండో డైరెక్టర్ లు గొల్ల వెంకటేష్, పడిగెల భూషణ్, మండల నాయకులు పాల్గొన్నారు.