MLA Vedma Bojju Patel: కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు

సిరాన్యూస్‌, ఇంద్రవెల్లి
కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ, బీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు
*కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో వెడ్మ బొజ్జు పటేల్ ఇంద్రవెల్లి మండలంలోని బీజేపీ,బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన మాజీ సర్పంచ్ కోరెంగ సుంకట్ రావు, మాజీ వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్ సింగ్, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మాజీ మండల అధ్యక్షుడు జుగ్నాక్ భారత్, లతో పాటు మండలంలోని పోల్లుగూడ, లింగాపూర్, ఆందుగూడ, తదితర గ్రామాలకు చెందిన పటేల్లు 60 మందితో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు అమలు చేస్తున్న పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ప్రజా ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలో అవుతుందని,ఇంద్రవెల్లి మండలంలోని పరిసర గ్రామీణ ప్రాంతాలలో కోట్ల రూపాయలతో రోడ్డు మురికి కాలువలు నిర్మించామని తెలిపారు.నీటి ఎద్దటిగల గ్రామాలను గుర్తించి బోరు వెల్స్ వేసి త్రాగు నీటి సమస్యను తీర్చమన్నారు. దశలవారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *