సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజు అర్ధరాత్రి రెండు గంటల వరకు పూజలు జరిగాయి .రెండో రోజు శుక్రవారం తెల్లవారుజాము నుంచి తిరిగి భక్తులు ఆలయాలకు చేరుకుంటున్నారు.
నవరాత్రులలో అమ్మవారికి ప్రీతికరమైనది శుక్రవారం, మూలా నక్షత్రం. రెండో రోజే శుక్రవారం రావడంతో ఆలయాలకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రజాప్రతినిధులు దర్శనాలు చేసుకుంటున్నారు. పౌరసరఫరాల సంస్థ చైర్మన్ తోట సుదీర్ పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది..