సిరాన్యూస్, ఓదెల
శిథిలావస్థలో ఓదెల ఆయుర్వేద ఆస్పత్రి
తరచూ ఊడిపడుతున్న పెచ్చులు.. ఎక్కడికక్కడ తేలిన ఇనుప రాడ్
* భయంతో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది
ఓదెల మండల కేంద్రంలో 1993 సంవత్సరంలో నిర్మించిన ఆయుర్వేద ఆస్పత్రి భవనం శిథిలమైంది. ఇటీవలి వర్షాలకు ఆసుపత్రి పైకప్పు తరచూ పెచ్చులూడుతూ వైద్యులు, రోగులపై పడుతున్నాయి. అప్పుడు ఈ ఆస్పత్రిని ప్రాంతీయ సంచాలకులు భగత్ సింగ్ ఠాగూర్ తో ప్రారంభోత్సవం చేయించారు. ఆస్పత్రి నిర్మించి 30 ఏళ్ళు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టడం లేదు. పాతబడిన ఆసుపత్రికి వచ్చి చికిత్స కోసం రావాలంటేనే రోగులు భయపడుతున్నారు. తరచూ పెచ్చులూడిపడుతుండడంతో తాము బిక్కుబిక్కుమని కాలం గడుపుతున్నామని వైద్య సిబ్బంది సైతం ఆందోళన చెందుతున్నారు. హాస్పిటల్ లో ఎలాంటి వసతులు లేవు. అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. వర్షం వచ్చినా ఉరుమొచ్చినా మెరుపు వచ్చిన స్లాబ్ ఎప్పుడు కులుస్తుందని భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపల్లి డిఎంహెచ్వో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఓదెలలో నూతన ఆయుర్వేద హాస్పిటల్ నిర్మించి ప్రజలకు మెరుగు వైద్యం అందించాలని స్థానికులు కోరుతున్నారు.