సిరా న్యూస్,హైదరాబాద్;
రాజకీయ నేతలు, సినిమాస్టార్లది అవినాభావ సంబంధమే. మరీ ముఖ్యంగా సినీ నటులకు పొలిటికల్ లీడర్లకు మధ్య సత్సంబంధాలు ఉండటం కామనే. అయితే.. ఇవి ఒక్కోసారి అనుకోని ఇబ్బందులుగా మారుతుంటాయి. ఇప్పుడు టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ విషయంలోనూ ఇదే జరుగుతోందన్న చర్చ మొదలైంది.హైడ్రా.. ఈ పేరు చెబితే అంతా హడల్. హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతల అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా రగులుతూనే ఉంది. హైడ్రా పేరు మార్మోగింది మాత్రం.. నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసినప్పుడే. సినిమా రంగంలో పెద్ద కుటుంబానికి చెందిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చేసిందంట అనే వార్త అటు టాలీవుడ్‌లో, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ హడావుడి చేసేసింది.దీనిపై రోజుల తరబడి చర్చోపచర్చలు జరిగాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి నాగార్జున సన్నిహితంగా మెలిగే వారని.. అందుకే ఆయన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు ఎసరొచ్చిందన్న వాదనలు టాలీవుడ్ అండ్ పొలిటికల్ సర్కిల్స్‌లో బాగా హల్ చల్ చేశాయి. అప్పట్లో నాగార్జున కోడలుగా ఉన్న ఇప్పటి మాజీ కోడలు , హీరోయిన్ సమంత తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేవారు.ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో బీఆర్ఎస్‌నే కాకుండా గతంలో ఆ పార్టీకి సన్నిహితంగా మెలిగిన వారిని కూడా రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందన్న వాదనలు ఉన్నాయి. అందుకే ఎస్పెషల్లీ టాలీవుడ్‌కు చెందిన వారిలో నాగార్జున టార్గెట్‌గా ఆయనకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇష్యూలో రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకత కంటే సానుకూలతే ఎక్కువ వచ్చిందని చెప్పాలి.సీఎం రేవంత్ నాగార్జునను ప్రత్యేకంగా ఏమీ టార్గెట్ చేయలేదని.. హైడ్రా బాధ్యతల నిర్వహణలో భాగంగా తన, పర బేధం లేకుండా ఒకే ధోరణిలో వెళ్తోందన్న వాదనలు వినిపించాయి తనవాళ్లు, పరాయి వాళ్లనే తేడా లేకుండా ఆక్రమణల కూల్చివేతలో హైడ్రా పారదర్శకంగా వ్యవహరించిందని రేవంత్ సర్కార్‌పై కొందరు ప్రశంసలు కురిపించారు కూడా. ఆ తర్వాత దీనిపై పెద్దగా చర్చ జరగలేదు. సో.. ఈ ఇష్యూలో ప్రభుత్వానికి పాజిటివ్ మైలేజ్ బాగానే వచ్చిందని చెప్పాలి.అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిఫెన్స్‌లో పడే సిచ్యుయేషన్ వచ్చింది. అది కూడా అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గురించే. మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించారు. ఇందులో హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతల విడాకుల అంశం ప్రస్తావించడం పొలిటికల్ దుమారాన్ని రేపింది. అసలు నాగార్జున, చైతూ, సమంతలకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకున్నా.. వారిని ఈ చర్చలోకి లాగడం పెద్ద వివాదమైకూర్చుంది.అటు రాజకీయ నేతల నుంచే కాకుండా ఇటు టాలీవుడ్ ప్రముఖల నుంచి కూడా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఏ ఉద్దేశంతో వాళ్లను ఇందులోకి లాగి కాంట్రవర్సీని చేశారన్న చర్చ జరుగుతోంది. ఇది అనుకోకుండా జరిగిందా..? లేక వాంటెడ్‌లీ నాగార్జున ఫ్యామిలీ టార్గెట్‌గా జరిగిందా..? అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. గతంలో నాగ్ బీఆర్ఎస్ సర్కార్‌తో రాసుకుపూసుకు తిరగడం వల్లే ఈ నిందలను పడాల్సి వస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చినప్పుడు ఇదంతా పరిపాలనా సంస్కరణలో భాగమన్న వాదనలు వినిపించాయి. రేవంత్ సర్కార్ చేసిన దాంట్లో పెద్ద తప్పేం లేదని.. ఎవరి ఒత్తిడిలకు ప్రభుత్వం లొంగకుండా ముక్కుసూటిగా వెళ్తోందన్న ప్రశంసలు దక్కాయి. అట్ ద సేమ్ టైమ్.. ఈసారి మాత్రం కొండా సురేఖ వ్యాఖ్యలతో రేవంత్ సర్కార్ డిఫెన్స్‌లో పడాల్సి వచ్చింది.తీవ్రమైన వ్యతిరేకత పొలిటికల్, సినీ వర్గాల నుంచి ఎదుర్కొంటోంది కాంగ్రెస్ సర్కార్. ఇది ఓరకంగా రేవంత్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిందని అనుకుంటున్నారు. నిజంగానే నాగార్జునను టార్గెట్ చేసుకుని కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారన్న నిందలు ప్రభుత్వంపై పడుతున్నాయి. మరి ఈ వివాదానికి ఎలా ముగింపు పలుకుతారనేది చూడాలి.