నిజామాబాద్ లో బెర్త్ దక్కేది ఎవరికి…

సిరా న్యూస్,నిజామాబాద్;
కాంగ్రెస్‌ పాలిటిక్సే డిఫరెంట్. ఎవరు ఎప్పుడు ఏ పదవి రేసులో ఉంటారో..ఎవరిని ఎందుకు పదవులు వరిస్తాయో అర్థం కావు. ఇప్పుడు ఇందూరు హస్తం పార్టీ పాలిటిక్స్‌ కూడా అలాగే ఉన్నాయి. అమాత్యులవారు అనిపించుకోవాలని ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఒకరికి సీఎం మద్దతు ఉంటే.. మరొకరికి అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయట.దాంతో ఇందూరు కాంగ్రెస్‌లో అమాత్య రేసు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి సహ సీనియర్లు మాజీమంత్రికి జైకొడితే..ఢిల్లీ పెద్దలు మాత్రం జూనియర్‌కు సపోర్ట్ చేస్తున్నారట. రెండో విడత క్యాబినెట్‌ విస్తరణలో బెర్త్ దక్కుతుందని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే అందులో సీనియర్ ఎమ్మెల్యే..జూనియర్ ఎమ్మెల్యే మధ్య మంత్రి పదవి కోసం టఫ్‌ పైట్ జరుగుతుంది. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు రేవంత్ క్యాబినెట్‌లో బెర్త్ కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నట్లు తెలుస్తోంది.నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్త్ దాదాపుగా ఖరారైనప్పటికి..ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు తన పేరు పరిశీలించాలంటూ రాహుల్ టీంతో ఒత్తిడి చేయిస్తున్నారట. దీంతో సుదర్శన్ రెడ్డి పేరు ఖరారైనా..మదన్ మోహన్ ప్రయత్నాలతో ఆ ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడుతుందనే చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి ఇదొక కారణంగా చెబుతున్నారట హస్తం పెద్దలు.మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మొదటి విడతలోనే తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించారట. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రాజకీయ పరిణామాలతో బ్రేక్ పడిందనే ఓపెన్ సీక్రెట్. నిజామాబాద్ హస్తం పార్టీలో సీనియర్‌గా ఉన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహదారుడిగా నియమించారు సీఎం రేవంత్‌.మహేష్ కుమార్ గౌడ్‌కు పీసీసీ చీఫ్‌ పదవి దక్కింది. ఇక నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా సీనియర్ కోటాలో సుదర్శన్ రెడ్డి మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తన సీనియారిటీని, సిన్సియారిటీని పరిగణనలోకి తీసుకోవాలంటున్నారట సుదర్శన్ రెడ్డి. అయితే ఆయన రెడ్డి సేవలను స్పీకర్‌గా వాడుకోవాలని అధిష్ఠానం భావించినా..ఒప్పుకోలేదని తెలుస్తోంది. క్యాబినెట్ బెర్త్ కోసం పట్టుబట్టి ఓకే అనిపించుకున్నా..మదన్ మోహన్ పేరు తెరపైకి రావడంతో జస్ట్‌లో మిస్‌ అయినట్లు టాక్ వినిపిస్తోంది. రాహుల్ టీమ్ మదన్ మోహన్ పేరును ప్రస్తావిస్తుంటే…రాష్ట్ర నాయకత్వం సుదర్శన్ రెడ్డికి మద్దతిస్తున్నారట.ఇక కాబోయే మంత్రినంటూ సుదర్శన్ రెడ్డి జిల్లాలో హడవుడి చేస్తున్నారట. ఎవరు పోటీకి వచ్చినా సీనియారిటికే ప్రాధాన్యత ఉంటుందని సుదర్శన్ రెడ్డి చెప్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి సర్ధి చెప్పారని ప్రచారం జరుగుతోంది. మదన్ మోహన్‌కు చీఫ్‌ విప్ ఆఫర్ చేశారట. దీంతో సుదర్శన్ రెడ్డి లైన్ క్లియర్ అయిందని అంటున్నారు. మొత్తానికి పెద్దాయన పంతం నెగ్గించుకుని రేవంత్ రెడ్డి టీమ్‌లో బెర్త్ దక్కించు కోబోతున్నారని ఖుష్‌లో సుదర్శన్ రెడ్డి వర్గీయులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *