సిరా న్యూస్,గుంటూరు;
రాష్ట్రంలో గత మూడేళ్ల విద్యార్థులకు పాత సిలబస్‌తోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు కొత్త సిలబస్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. వెబ్‌సైట్‌లో ప్రశ్నాపత్రాలు, మోడల్ పేపర్లు, మార్కుల వెయిటేజీ వంటి అప్‌లోడ్ చేశారు.పదో తరగతి 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి చదివి ఫెయిల్ అయిన విద్యార్థులకు పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఎగ్జామినేషన్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ దేవానందరెడ్డి తెలిపారు. ఆ మూడు సంవత్సరాల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు, ఈ ఏడాది ఫెయిల్ అయిన సబ్జెట్ల రాయలనుకుంటే వారు పాత సిలబస్ ప్రకారమే రాయడానికి అవకాశం ఉంది. ప్రైవేట్, రీ ఎన్‌రోల్ చేసుకున్న విద్యార్థులు, ఆయా సంవత్సరాల్లో ఏ సిలబస్ ప్రకారం అయితే పరీక్షలు రాశారో, ఈ ఏడాది పబ్లిక్ పరీక్షల్లో కూడా వారికి పాత సిలబస్ వర్తిస్తుంది.ప్రస్తుత విద్యా సంవత్సరం (2024-25) పదో తరగతి విద్యార్థులకు మాత్రం మారిన కొత్త సిలబస్ ప్రకారం పబ్లిక్ పరీక్షలు ఉంటాయి. అందుకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు, బ్లూ ప్రింట్, ఏడు పేపర్లకు సంబంధించి ప్రశ్నల వారీగా మార్కుల వెయిటేజీ, మోడల్ పేపర్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్ లో ఉంచారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం 2024-25 పదో తరగతి విద్యార్థులకు కొత్త సిలబస్ ప్రకారమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పదో తరగతి హిందీ పేపర్‌పై సమీక్షించి, సవరణ చేశారు. ఈ సవరణ చేసిన హిందీ పేపర్‌ను కూడా వెబ్‌సైట్‌లో అప్లొడ్ చేశారు.సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా చేపట్టిన డీఎస్పీ ఉచిత శిక్షణ కోసం ప్రముఖ ప్రైవేట్ శిక్షణా సంస్థల నుండిచ ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసే డీఎస్పీ ఉచిత శిక్షణకు సంబంధించి ఈ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే సాంఘిక్ష సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బు కొఠారి తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఆసక్తి ఉన్న శిక్షణా సంస్థల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకునే సంస్థలు గత రెండు డీఎస్సీ రిక్రూట్‌మెంట్లకు కోచింగ్ ఇచ్చి ఉండాలనే నిబంధన ఉంది. అలాగే ఆ సంస్థ ద్వారా వంద మందికి పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఉండాలి. మూడేళ్ల టర్నోవర్ సరాసరి రూ.40 లక్షలు ఉండాలి. ఆసక్తి ఉన్న డీఎస్సీ శిక్షణా సంస్థలు ఈనెల 21వ తేదీలోపు ఆన్‌లైనల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు అందుబాటులో వెబ్‌సైట్ ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందికి ఈ ఉచిత డీఎస్సీ శిక్షణ ఇస్తారు. రెసిడెన్షియల్ విధానంలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీలో అత్యున్నత శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.