సిరా న్యూస్,జగిత్యాల;
అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సుదూర ప్రాంతాలకు బదిలీ అయిన తహశీల్దార్లను తిరిగి పూర్వ జిల్లాలకు బదిలీ చేసేందుకు అప్షన్లు పంపించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సీ సీ ఎల్.ఏ.నవీన్ మిట్టల్ ఆదేశాలు జారీ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పై జిల్లా ట్రెసా అధ్యక్షుడు ఎం.డీ.వకీల్,ప్రధాన కార్యదర్శి నవీన్,కోశాధికారి కృష్ణ,మాజీ ట్రెసా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ లు హర్షం వ్యక్తం చేశారు.రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,సీ సీ ఎల్.ఏ.నవీన్ మిట్టల్,బదిలీలకు కృషి చేసిన ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్ రెడ్డికి,ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ లకు ట్రెసా జిల్లా కార్యవర్గం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.