బెట్టింగ్ లు ,ఆన్లైన్ గేమ్స్ లకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతున్న యువకులు

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకులమైలారం లో చోరీ
ఆన్లైన్ లో పరిచయమై దొంగతనాల బాటపట్టిన నిందితులు
చోరీ కేసు ఛేదించిన గ్రీన్ ఫార్మా సిటీ పోలీసులు
సిరా న్యూస్,ఇబ్రహీంపట్నం:
చదువుకున్న యువకులు బెట్టింగ్ లు ,ఆన్లైన్ గేమ్స్ లకు బానిసలై దొంగతనాలకు పాల్పడుతుండగా పోలీసులు పట్టుకొని రిమాండ్ కు తరలించారు. ఇబ్రహీంపట్నం ఏసీపి కేపీవీ రాజు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం రామన్నగూడెం కు చెందిన ఉటుకూరి ప్రభాస్ తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ఉంటూ కరీంనగర్ లో బీటెక్ చదువుతూ ఆన్లైన్ బెట్టింగ్ కు పాల్పడి లాస్ అయ్యాడు, మరొకరు నల్గొండ జిల్లా శాలిగౌరరం గ్రామానికి చెందిన గుండ్లపల్లి శివ మెడికల్ షాప్ వర్కర్ గా పనిచేస్తూ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతూ లాస్ అయ్యాడు. వీరిద్దరూ ఒకరికొకరు ఆన్లైన్ ఇన్స్టా గ్రామ్ లో పరిచయమయ్యారు. సులభమార్గంలో డబ్బులు సంపాదించడం కోసం చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. 10వ తేదీన ఒక బ్లూ కలర్ బేలానో (టీజీ07జీ8635) ను కిఱాయికి తీసుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధుల నివాసాలను రిక్కి నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామంలో ఒంటరిగా వృద్ధురాలు దేవరశెట్టి సుమతమ్మ ఇంట్లోకి ప్రవేశించి ఆమె నోర్రు మూసి ఒలరు పట్టుకోగా మరొకరు మెడలో, చేతులకు 6 తులాల బంగారు ఆభరణాలు(4-బంగారు గాజులు, రెండు తులాల పుస్తెల తాడు)ను కత్తెరతో కత్తిరించుకొని చోరీకి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు గ్రీన్ ఫార్మా సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి చాకచక్యంగా ఇద్దరు నిందితులను ఈ రోజు పట్టుకొని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. వారినుండి బంగారు ఆభరణాలు, కారు, ఐ ఫోన్, కత్తెర స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు. ఉన్నత చదువులు చదివి ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడి సులభ మార్గాల్లో డబ్బులను సంపాదించుటకు యత్నించడం మనేయ్యలని సూచించారు. ఎలాంటి నేరం చేసిన పోలీసుల కు చిక్కగా తప్పదన్నారు. చేడు మార్గాల్లో డబ్బులు సంపాదించడం మనేయ్యలని, ఇది తల్లిదండ్రులు, యువకులు గుర్తుంచుకోవాలన్నారు. ఒంటరి మహిళలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నిందితులను పట్టుకోవడం లో చాకచక్యంగా వ్యవహరించిన గ్రీన్ ఫార్మా సిటీ సిఐ కృష్ణమ్ రాజు, సిబ్బందిని ఏసీపి అభినందించి రివార్డులను అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *