Model School Jainath: జైనథ్ మోడల్ స్కూల్ లో ఘనంగా రామానుజన్ జయంతి…

సిరా న్యూస్, జైనథ్:

జైనథ్ మోడల్ స్కూల్ లో ఘనంగా రామానుజన్ జయంతి…

ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో రామానుజన్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా పాఠశాలలో గణిత దినోత్సవంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రామానుజన్ చిత్రపటాన్ని ముగ్గులతో వేశారు. పలు గణిత శాస్త్ర ప్రదర్శనలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జావేద్ మాట్లాడుతూ… రామానుజన్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *