సిరాన్యూస్, ఓదెల
సీల్డ్ అవార్డు అందుకున్న సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మ చారి నేత
ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంస్థ వ్యవస్థాపకులు గుల్లపల్లి నాగేశ్వరరావు చేతుల మీదుగా సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెరుగు భీష్మ చారి నేత సీల్డ్ అవార్డు అందుకున్నారు. 50వేల కార్నియా మార్పిడి మార్పిడి చేసి, 50వేల మందికి కంటి చూపును ప్రసాదించి ప్రపంచంలోనే మొదటి సంస్థగా హైదరాబాద్ లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ లో బుధవారం రాత్రి ప్రత్యేక సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ లో ఓదెల మండల కేంద్రానికి చెందిన మెరుగు భీష్మ చారి నేత కు సదాశయ ఫౌండేషన్ ద్వారా పాల్గొన్నందుకు ప్రత్యేక ఆహ్వానం అందించారు. నేత్రదానం కోసం అవగాహన కల్పిస్తూ మెరుగు భీష్మ చారి నేతకు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంస్థ వ్యవస్థాపకులు గుల్లపల్లి నాగేశ్వరరావు చేతుల మీదుగా సీల్డ్ అవార్డు అందించారు. అనంతరం భీష్మ చారి నేత మాట్లాడుతూ 50 వేల కార్నియా లు మార్పిడి చేసి 50 వేల మందికి కంటిచూపునందించిన ప్రపంచంలోనే మొదటి సంస్థ హైదరాబాద్ ఎల్.వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ రికార్డు సృష్టించిందని అన్నారు. అలాగే లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ సదాశయ ఫౌండేషన్ నిర్వహిస్తున్న నేత్రదాన కార్యక్రమాలను ఏకగ్రీవ తీర్మానం గూర్చి తెలుసుకొని ఐ బ్యాంక్ మేనేజర్ కిషన్ రెడ్డి సదాశివ ఫౌండేషన్ నిర్వాహకులను అభినందించారు.ఈ సదస్సు ఫౌండేషన్ వారు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కృతజ్ఞతలు తెలిపారు.