షారూఖ్ హ్యాట్రిక్…మిస్సైనట్టేనా

సిరా న్యూస్,ముంబై,
‘పఠాన్’, ‘జవాన్’… 2023లో బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ రెండు భారీ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ‘డంకీ’తో థియేటర్లలోకి వచ్చారు. ‘మున్నాభాయ్’ సిరీస్, ‘3 ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ ఫేమ్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించిన చిత్రమిది. ‘డంకీ’ 2023లో షారుఖ్ హ్యాట్రిక్ హిట్ అవుతుందా? సినిమా ఎలా ఉంది?కథ : హర్ఢీ సింగ్ థిల్లాన్ (షారుఖ్ ఖాన్) సైనికుడు. అతడిది పఠాన్ కోట్. తన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని వెతుకుతూ లల్టూ వస్తాడు. అక్కడ మను (తాప్సీ పన్ను) పరిచయం అవుతుంది. మెరుగైన జీవితం కోసం, ఊరిలో కష్టాల నుంచి బయట పడటం కోసం ఆమెతో పాటు మరో ఇద్దరు స్నేహితులు లండన్ వెళ్ళాలని ట్రై చేస్తారు. అందుకోసం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అష్టకష్టాలు పడతారు. కానీ, వీసాలు రావు. అప్పుడు దొంగ దారిలో లండన్ వెళతారు. హార్డీ, మనుతో పాటు మిగతా వాళ్ళు లండన్ ఎలా వెళ్ళారు? ప్రయాణంలో ఎన్ని కష్టాలు పడ్డారు? లండన్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళ జీవితాల్లో సుఖీ సింగ్ ( విక్కీ కౌశల్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీకి తెలుగులోనూ కొందరు అభిమానులు ఉన్నారు. ఎటువంటి కథ, సన్నివేశంలో అయినా వినోదం మేళవించి చెప్పడంలో ఆయన స్పెషలిస్ట్. ‘3 ఇడియట్స్’, ‘పీకే’, ‘సంజు’ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో మంచి వసూళ్లు సాధించడానికి కారణం ఆయన టేకింగ్ & డైరెక్షన్. ‘డంకీ’ని తెలుగులో డబ్బింగ్ చేయకపోయినా… తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపించడానికి కారణం రాజ్ కుమార్ హిరాణీ. దర్శకుడిపై అంచనాలతో ‘డంకీ’ థియేటర్లలో అడుగుపెట్టిన జనాలకు కాస్త నిరాశ తప్పదు.’డంకీ’ కథను ఒక్క జానర్‌కు పరిమితం చేయలేం. ఇందులో అడ్డదారుల్లో వలస వెళ్ళడానికి కొందరు ఎటువంటి కష్టాలు పడుతున్నారు? అనేది చాలా హృద్యంగా చూపించారు. స్వచ్ఛమైన ప్రేమకు కాలం అడ్డు కాదని చెప్పారు. అంతర్లీనంగా దేశభక్తి, మాతృదేశంపై ప్రేమ కూడా ఉన్నాయి. అయితే… అడుగడుగునా రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్ స్టైల్ & ఆయన హ్యూమర్ మిస్ అయిన ఫీలింగ్ ఒక వైపు కలుగుతూ ఉంటుంది. ఏదో వెలితి! ఎమోషనల్ డ్రామాలో డెప్త్ మిస్ అయ్యింది. ఫోర్డ్స్ ఎమోషన్ చెప్పినట్టు అనిపిస్తుంది. షారుఖ్ ఖాన్ తర్వాత ‘డంకీ’ చిత్రానికి ప్రేక్షకులు రావడానికి రాజ్ కుమార్ హిరాణీ పేరు ఎంత ప్లస్ అయ్యిందో… థియేటర్లలోకి వెళ్ళాక ఆయనపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలు అంత మైనస్! వీసా ఇంటర్వ్యూలలో ఇంగ్లీష్ రాక నటీనటులు పడే అవస్థలు నవ్వులు పూయిస్తాయి. అంతకు ముందు బోమన్ ఇరానీ ఇంగ్లీష్ క్లాసులు అంతగా ఆకట్టుకోవు. కామెడీలో రాజ్ కుమార్ హిరాణీ తన పట్టు చూపించారు. ఎమోషనల్ డ్రామా అంతగా పండలేదు.నెక్స్ట్ ఏంటి? అనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో, ఆసక్తిగా సినిమా చూసేలా చేయడంలో రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వ శైలి కనిపించలేదు. డంకీ రూటులో బోర్డర్ దాటడం అనే పాయింట్ కూడా కొత్త కాదు. హిందీలో సల్మాన్ ఖాన్ ‘భజరంగీ భాయీజాన్’ చేశారు. కాకపోతే… ఆ కథ వేరు, ఈ కథ వేరు. ఎమోషన్స్ వేరు! ‘డంకీ’ రూటులో విదేశాలు వెళ్ళిన వాళ్ళను 25 ఏళ్ళ తర్వాత ‘డంకీ’ రూటులో మళ్ళీ స్వదేశానికి తీసుకు రావడం దర్శకుడి స్టైల్ అని చెప్పుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *