సిరా న్యూస్,బీజాపూర్;
గత నెల 21వ తేదీ నుండి ఈ నెల 20వ తేదీ వరకు మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవ వేడుకలు గ్రామ గ్రామాన,వాడవాడలా జరుపుకోవాలని మావోయిస్టు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ-చత్తీస్-ఘడ్ సరిహద్దు దండకారణ్యంలోని వివిధ గ్రామాల్లో మావోయిస్టు పార్టీ వార్షికోత్సవ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో బీజాపూర్ జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో గత నెల నుండి పలు ఆదివాసి గ్రామాలకు చెందిన గిరిజనులతో 20వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి కుటుంబం నుండి ఇంటిల్లిపాది ముసలి ముతక,పిల్లాపాపలతో సహా ఈ వార్షికోత్సవాల్లో పాల్గొని అమరవీరులను స్మరిస్తూ మనుగడకు మూలవాసులైన ఆదివాసీల హక్కులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు హరిస్తున్నారంటూ ర్యాలీలు నిర్వహించారు. తాజాగా జరిగిన ఎన్కౌంటర్లలో మావోయిస్టు పార్టీ భారీగా నష్టపోయిన నేపథ్యంలో కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా ఈ వార్షికోత్సవాలను మావోయిస్టు పార్టీ గత నెల నుండి యదేచ్చగా కొనసాగిస్తోంది.
ఈ వార్షికోత్సవాల వేడుకలు మరో రెండు రోజుల్లో ముగియనున్న వేళ గ్రామ గ్రామాన ఈ వేడుకలు ఉధృతంగా సాగుతున్నట్లు సమాచారం తెలుస్తోంది…