సిరా న్యూస్,హైదరాబాద్;
మూసీ ప్రక్షాళన పేరుతో సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తున్నారన్న కేటీఆర్, హరీశ్ రావు వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. గతంలో రియల్ ఎస్టేట్ పేరుతో హైదరాబాద్ చుట్టూ కేటీఆర్ ప్లాట్లు అమ్ముకున్నారని అన్నారు. అప్పుడు ప్లాట్లు అమ్ముకోవడం వల్లే ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. తెలంగాణ పునర్జీవనం అని మాట్లాడిన హరీశ్ రావు. అది ఎక్కడ చేశారో చూపించాలని ప్రశ్నించారు.