డి ఎస్ ఎఫ్, ఆధ్వర్యంలో ధర్నా
సిరా న్యూస్,ఆదోని;
పట్టణంలో డి ఎస్ ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ధనాపురం ఉదయ్ డివిజన్ కార్యదర్శి నవీన్ వినీల్ మాట్లాడుతూ…. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, ఎంతోమంది పేద విద్యార్థులు కళాశాలలో ఫీజులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే డిగ్రీ పూర్తయిన విద్యార్థులు బీఈడీ పూర్తయిన విద్యార్థులు ఈజీ పూర్తయిన విద్యార్థులు కళాశాలలో సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఫీజు కళాశాలలో కడితేనే ఇస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది… కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని డి ఎస్ ఎఫ్,విద్యార్థి సంఘం గా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము… అలాగే ఈ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుంటే……?? రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులనంత ఏకం చేసుకుని ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు డి ఎస్ ఎఫ్, విద్యార్థి సంఘంగా ముందుండి కార్యక్రమాలు నిర్వహిస్తామని అవసరమైతే కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించేందుకు సిద్ధమవుతామని మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈ సమావేశంలో డిఎస్ఎఫ్ నాయకులు రాజ్ కుమార్ విక్రమ్ సోమశేఖర్ అరుణ్ విక్రమ్ రాజేష్ సుకుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.