Sangidi: సాంగిడిలో ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

సిరాన్యూస్‌, బేల
సాంగిడిలో ఆకట్టుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామానికి చెందిన 2006-2007 ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న 10 వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఎంతగానో ఆకట్టుకుంది.సాంగిడి గ్రామంలో హనుమాన్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. పాఠాలు బోధించిన గడ్డం నాగరెడ్డిని సన్మానించారు.ఈ సందర్భంగా ఒకరినొకరు తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు.ప్రతి ఒక్కరు తమ తోటి స్నేహితుల కష్టసుఖాల్లో పాలుపంచుకొని చేదోడు వాదోడుగా తమ వంతు సహాయ సహకారాలను అందించాలని ప్రతిజ్ఞ చేశారు.ఇందులో భాగంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న తమ తోటి మిత్రులను ఆపద సమయంలో ఆదుకునేందుకు జమచేసి ఆపద వచ్చినప్పుడు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. భవిష్యత్తులో ఏది ఏమైనా తమ పదవ తరగతి విద్యార్థులు అందరూ ఒకరినొకరు తమ కష్టసుఖాలను తోటి మిత్రులతో పంచుకోవాలని తోచిన సహాయాన్ని అందించి కష్టాల్లో ఉన్న తమ స్నేహితునికి అండగా నిలవాలని తెలియజేశారు.కార్యక్రమంలో దిడ్సే విపుల్, అనిల్ డోకే,చెన్న రమాకాంత్, అడ్డికి సునీల్, రనథిర్, జనార్థన్, రనీల్, హరి, గణేష్, మహేందర్, నరేష్, తది తరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *