సిరా న్యూస్,విజయవాడ;
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు క్రాస్ రోడ్ వద్ద కరెంటు స్తంభాన్ని కారు ఢీకొంది. ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ఇద్దరు గాయాలపాలయ్యారు. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణికులు సెల్ఫ్ డ్రైవింగ్ మీద హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నారు. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.