సిరాన్యూస్, బేల
గ్రామ పంచాయతీ నిర్మాణానికి అనుమతి ఇవ్వండి : సామ రూపేష్ రెడ్డి
* కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతి పత్రం అందజేత
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం లో గల గణేష్ పూర్ గ్రామం ప్రస్తుతం అటవీ శాఖ పరిధిలో ఉందన్నున దీంతో గ్రామ పంచాయతీ భవనం కట్టుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని సోమవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు కలిసి యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి సామ రూపేష్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా అటవీశాఖ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో గ్రామానికి ఏళ్లుగా పంచాయితీ భవనం లేదన్నారు.దీనివల్ల గ్రామంలోని ప్రజలకు అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయనీ అన్నారు. సంబంధిత అధికారులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో కూర్చోవలసి రావడంతో అటు విద్యార్థులకు ఇటు గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.అందుకు గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి అటవీ శాఖ అధికారులు అనుమతి ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ కి తెలియ జేయడం జరిగిందన్నారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి పర్మిషన్ ఇప్పిచ్చేటట్టు చూస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాపురావు,టేకం బీం రావు,మాడవి చిన్ను,వికాస్,టేకం జంగు తదితరులు ఉన్నారు.