సిరాన్యూస్, ఆదిలాబాద్
అయోడిన్ ఉప్పును వాడాలి: డాక్టర్ సర్ఫరాజ్
అయోడిన్ ఉప్పును వాడాలని డాక్టర్ సర్ఫరాజ్, డాక్టర్ సాగర్లు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకొలి ఆసుపత్రిలో అయోడైజ్డ్ దినోత్సవం సందర్భంగా గర్భిణీలకు, సాధారణ రోగులతో ఉప్పు లో ఉండే అయోడిన్ గురించి వివరించారు. ఈసందర్బంగా డాక్టర్ సర్ఫరాజ్ మాట్లాడుతూ శరీరా మానసిక ఆరోగ్యం, సరైయిన పెరుగుదల,చురుకుదనం, ఉత్సాహం, జ్ఞాపకశక్తిని కల్గి ఉండుట, గర్బస్త్రా శిశువు పెరుగుదల, చదువుల్లో వయసుకు దగ్గ ప్రతిభ చూపుడం, అయోడైజ్డ్ ఉప్పు-ఆరోగ్యమైన జీవితానికి నాంది అని వివరించారు. ప్రతి వ్యక్తి ఒక్కరోజుకు 5 గ్రాముల ఉప్పునే వాడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్స్ బొమ్మెత సుభాష్, శకుంతల,శ్యామలప్రేమసింగ్,సమి, తిరుమల,ప్రతిమ, అశాకార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.