ఐఆర్సీటీసీ
సిరా న్యూస్,సికింద్రాబాద్;
శబరిమల దివ్యక్షేత్రాన్ని దర్శించు కోవాలనుకొనే యాత్రికులకు ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ నుంచి శబరిమల కు ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్టు రైలును నవంబర్ 16 నుంచి 20 వరకు నడపాలని నిర్ణయించింది. టికెట్ ధరలు రూ.11,475 నుంచి ప్రారంభమవుతాయి. భోజనాలు అన్ని రైల్వే సిబ్బందే చూసుకుంటారు.అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది.