సిరాన్యూస్, కాల్వ శ్రీరాంపూర్
వెన్నంపల్లి రింగ్ రోడ్డు కు రూ.7 కోట్ల నిధులు మంజూరు: మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పనిచేస్తున్నారని మాజీ ఎంపీపీ
గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామ రెండు వలసల రహదారి రింగ్ రోడ్డుకు పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణారావు రూ.7 కోట్లు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ ఆధ్వర్యంలో స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజానవేన సదయ్య, కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం డి. మున్నీర్, మాజీ జడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, వెన్నంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.