Softball Games Nirmal: అట్టహాసంగా సాఫ్ట్‌ బాల్‌ పోటీలు

సిరా న్యూస్, నిర్మల్‌ టౌన్‌:

అట్టహాసంగా సాఫ్ట్‌ బాల్‌ పోటీలు
–రాష్ట్రస్థాయి బాల, బాలికల సాఫ్ట్‌ బాల్‌ పోటీలు ప్రారంభం
–జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్‌
–10 ఉమ్మడి జిల్లాల నుంచి 340 మంది క్రీడాకారులు హాజరు

నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అండర్‌– 17 బాల, బాలికల సాఫ్ట్‌ బాల్‌ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్కూల్‌ ఫెడరేషన్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 బాల బాలికల సాఫ్ట్‌ బాల్‌ పోటీలను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వన్‌ జెండా ఊపి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులు నుండి కలెక్టర్‌ గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఎస్జిఎఫ్‌ జిల్లా సెక్రెటరీ రమణారావు నేతృత్వంలో ఈ రాష్ట్రస్థాయి పోటీలకు 10 ఉమ్మడి జిల్లాల నుండి ఒక్కొక్క టీంకు 16 మంది క్రీడాకారుల చొప్పున 10 బాలుర, 10 బాలికల జట్ల నుండి మొత్తం 340 మంది క్రీడాకారులు, 20 మంది కోచ్‌ లు, 20మంది సబ్‌ కోచ్‌లు హాజరయ్యారు. వీరిలో బాలికలకు నిర్మల్‌ రూరల్‌ మండలం కేజీబీవీ పాఠశాలలో, బాలురులకు ఎన్టీఆర్‌ స్టేడియంలో వసతి కల్పించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాజస్థాన్‌ లోని బికనూర్‌లో జనవరి 11 నుండి 15 వరకు జరిగే జాతీయస్థాయి పోటీలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ క్రీడాకారులను పరిచయం చేసుకొని, కాసేపు ముచ్చటించారు. నృత్యాలు చేసిన విద్యార్థులకు జ్ఞాపికాలను అందజేశారు. మొదటిరోజు కరీంనగర్‌ బాలుర జట్టుపై నిజామాబాద్, హైదరాబాద్‌ జట్టుపై ఆదిలాబాద్, నల్గొండ జట్టుపై ఖమ్మం జట్లు విజయం సాధించాయి. కరీంనగర్‌ బాలికల జట్టుపై వరంగల్, రంగారెడ్డి జట్టుపై మెదక్, నల్గొండ జట్టుపై నిజామాబాద్‌ జట్లు విజయం సాధించాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్, జిల్లా విద్యాశాఖ ఇన్చార్జి అధికారి పద్మ, జిల్లా యువజన క్రీడల అధికారి నాపే ఖాన్, పేట సెక్రెటరీ భోజన్న, సాఫ్ట్బాల్‌ సెక్రెటరీ అన్నపూర్ణ, పీఈటీలు భూమన్న, రామారావు, జమున, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *