సిరాన్యూస్, ఇచ్చోడ
చిన్నారి వైద్యానికి రూ.50వేలు ఆర్థిక సాయం : సభావత్ శ్రీనివాస్ విజయ ట్రస్ట్ సభ్యులు
బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఓ చిన్నారికి ఆస్పత్రి ఖర్చు కోసం సభావత్ శ్రీనివాస్ విజయ ట్రస్ట్ సభ్యులు ఆర్థిక సాయం అందేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని జల్దా గ్రామానికి చెందిన అల్లెం రాములు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాడు. ఆయన కుమార్తె అల్లెం రమకుమారి ఇచ్చోడ విద్యాలయ పాఠశాలలో ఆరోతరగతి చదువుతోంది. ఇటీవల ఉన్నట్టుండి స్పృహా తప్పి పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ లోని రిమ్స్ కు తరలించారు. అక్కడ వైద్యులు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు వివిధ ఆస్పత్రుల్లో వైద్యం చేయించిన నయం కాకపోవడంతో ప్రస్తుతం నిజామాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చిక్సిత పొందుతుంది. పరీక్షించిన వైద్యులు చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్నట్టు తెలిపారు. ఖరీదైన వైద్యం కావడంతో కుటుంబ సభ్యులు దాతల కోసం ఎదురు చూశారు. అప్పుడు వారి కుటుంబ సభ్యులు సభావత్ శ్రీనివాస్ విజయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మెన్ శ్రీనివాస్ నాయక్ ను సంప్రదించారు. దీంతో ఆయన స్పందించి చిన్నారి వైద్యానికి ట్రస్ట్ ఆధ్యర్యంలో రూ.50వేలు అందించారు. కాగా ట్రస్ట్ సభ్యులు గురువారం ఉదయం జల్దా గ్రామానికి చేరుకొని, చిన్నారి మేనమామ శేఖర్, మాజీ సర్పంచ్ కృష్ణ, గ్రామస్తుల సమక్షంలో రూ.50వేల నగదును ట్రస్ట్ సభ్యులు కానిందే బాపూరావు, డాక్టర్ మల్లయ్య, ప్రవీణ్, మంగళగిరి రాములు, భూతి లక్ష్మణ్, ఎస్, రబ్బన్, జాదవ్ రమేష్, క్రాంతి అందజేశారు. కార్యక్రమంలో సర్వేయర్ గణేష్, టీఏ మోహన్ జాదవ్, ఉపసర్పంచ్ ప్రవీణ్, గ్రామపెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.