సిరా న్యూస్,మంథని;
ఫుట్బాల్ క్రీడ విశ్వ క్రీడ అని, ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందినదని ఈ క్రీడలో పాల్గొనడానికి చాలామంది ఆసక్తి చూపుతానని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరైయ్యారు.
ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అతి పురాతనమైన క్రీడా ఫుట్బాల్ అని, ప్రతి ఒక్క విద్యార్థి క్రీడల పట్ల ఆసక్తి ప్రదర్శించడమే కాకుండా వాటిలో పాల్గొని పెంపొందించుకొని విజయవకాశాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో విశ్వాసం నింపడానికి, క్రీడల పట్ల దృష్టి మళ్లించడానికి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తూ వివిధ స్థాయిలో నిర్వహింపబడే పోటీలకు ఎంపిక చేస్తూ వారికి అన్ని రకాలుగా చేయూతనిస్తున్నామని చెప్పారు. ఇటీవల కాలంలో గోదావరిఖనిలో నిర్వహించినటువంటి జోనల్ స్థాయి ఎస్.జి.యఫ్ అండర్ 14 ఫట్బాల్ ఎంపిక పోటీలలో పాఠశాలకు చెందిన యన్. నిశితల్, 8తరగతి, డి. సహస్రరెడ్డి, 9వ తరగతి, యం.డి ముక్రామ్, 8వ తరగతి, హేమంత్, 9 వ తరగతి లు అసమాన ప్రతిభను కనబరచడమే కాకుండా త్వరలో మహబూబ్ నగర్ లో నిర్వహించబోయే ఎస్.జి.ఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక అవడం చాలా గొప్ప విషయం అని చెప్పారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంగా విద్యార్థులకు పుష్పగుచ్చాలతో పాటు అర్హత పత్రాలను అందజేసి భవిష్యత్తులో నిర్వహించబోయే మరిన్ని పోటీలలో అత్యుత్తమ ప్రతిభను చాటి ఘనవిజయాల వైపు ప్రయాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.