సిరా న్యూస్,హైదరాబాద్;
మూసీ బాధితులకు పునరావాసానికి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తే అండగా ఉంటామని బిజెపి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి తెలిపారు.మూసారాం బాగ్ మూసీ పరివాహక ప్రాంతాలను నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్జీ తో కలిసి బిజెపి నేతలు పరిశీలించారు.. ప్రతి వంద బాధితుల కుటుంబాలకు ఒక అధికారిని ఏర్పాటు చేయాలని కోరారు. పేదలకు ఇక్కడి కంటే మెరుగైన పునరావాసం కలిపిస్తామని ప్రభుత్వo హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా మూసీ ఖాళీ చేసినా జాగాలను ప్రైవేట్. సంస్థలకు ఇవ్వమని.ప్రభుత్వ అధీనం లో ఉంటుందని.ఎలాంటి నిర్మాణాలు చెప్పట్టమని నమ్మకం కలిగించాలని అన్నారు..