కరోనా” పై నిర్లక్ష్యం వద్దు..అప్రమత్తంగా ఉందాం

సిరా న్యూస్,హైదరాబాద్ ;
రెండేళ్లకు ముందు ఎన్నో కుటుంబాలను తీవ్ర విషాదంతో పాటు అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ప్రస్తుతం మళ్ళీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుంది. పలు రకాల వేరియంట్లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కరోనా ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్లతో చాప కింద నీరులా వేగముగా విస్తరిస్తుంది. ప్రజలు కరోనా కొత్త వేరియంట్ జేఎన్ – 1 బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సాయి చౌదరి కోరారు.
ప్రజలలో భయాందోళన
జిల్లాలో వికారాబాద్, పరిగి,, తాండూర్, కొడంగల్ నియోజకవర్గాలలో చాలా రోజులుగా కరోనాకు సంబంధించి ఎక్కడ ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ప్రశాంతంగా ఉన్న ప్రజలలో కొత్త వేరియంట్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రజలలో భయాందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రజలు నిర్లక్ష్యాన్ని వీడి మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రంగా కడుకోవాలని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఒక్క కేసు నమోదు కానప్పటికీ, ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల నుంచి వ్యాపారాల నిమిత్తము, ఉద్యోగాల నిమిత్తము వచ్చే ప్రజలతో అప్రమత్తంగా ఉండాలని దగ్గు, జలుబు, జ్వరంతో పాటు కరోనా లక్షణాలు ఉంటే సమాచారము అందించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో బస్సుల్లో రద్దీ పెరిగిపోవడంతో పాటు న్యూ ఇయర్ వేడుకల పేరిట యువత చేయనున్న హంగామా, జాతరలో రద్దీతో కరోనా కేసులు పెరిగే ఆస్కారం ఉండటంతో ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించేలా ప్రత్యేక దృష్టి సారించాలని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి అభిప్రాయపడ్డారు.
జ్వరము, జలుబు, దగ్గు, ఫ్లూ వంటి లక్షణాలతో బాధపడే వారిని గుర్తించి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో రాపిడ్ యాంటీ జన్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారని, కరోనా బారిన పడిన వారిని సాధ్యమైనంత వరకు ఇళ్ల వద్దే ఉంచి వైద్య సేవలు అందించాలని, తీవ్రతను బట్టి ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా 45 దేశాలలో ఈ వేరియంట్ వ్యాప్తి చెందగా మనదేశంలో కేరళలో ఫస్ట్ కేసులు నమోదయినాయి. గోవా, మహారాష్ట్రలో ఈ కేసులు వస్తుండగా నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆరు కేసులు అధికారికంగా నమోదు అవగా తీవ్రమైన శ్వాస సమస్యలతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేటటువంటి పేషంట్ శాంపిల్ సేకరించి జీనోము సీక్వెన్సింగ్ టెస్టులకు పంపాలని ప్రభుత్వము అధికారులను ఆదేశాలిచ్చిందని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి పేర్కొన్నారు.
వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే 10 సంవత్సరాల లోపు పిల్లలు, గర్భిణీలు మరియు 60 సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి కోరారు. ఇండ్ల నుంచి బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని, జ్వరము, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, బాడీపెయిన్స్ వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *