Odela Road: ఓదెల రోడ్డు వెడల్పు ప‌నులు ప్రారంభం

సిరాన్యూస్, ఓదెల‌
ఓదెల రోడ్డు వెడల్పు ప‌నులు ప్రారంభం

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఏళ్ల తరబడి ఇరుకు రోడ్లతో ఇబ్బంది పడ్డ ప్రజలకు మోక్షం ల‌భించింది. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఆదేశాల మేరకు ఓదెల గ్రామంలో మడక రోడ్డు నుండి డి 86 కెనాల్ వరకు 36 ఫీట్ల వెడల్పుకు శ్రీకారం చుట్టారు. 100 రోజులలో రోడ్డు వెడల్పు ప‌నులు జ‌ర‌గ‌నుంది. శుక్రవారం గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామ మాజీ ఎంపిటిసి బోడగుంట లక్ష్మీ చిన్నస్వామి ఆధ్వర్యంలో జేసీబీ సహాయంతో రోడ్డు ప‌నుల కార్యక్రమం చేప‌ట్టారు. రోడ్డు వెడల్పు కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చీకట్ల మొండయ్య, పచ్చిమట్ల శ్రీనివాస్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ ప్రజలు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *