సిరా న్యూస్,హైదరాబాద్;
కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఏయిమ్స్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. తమ సర్టిఫికెట్స్ తమకి ఇప్పించాలి అని డిమాండ్ చేస్తున్నారు. కేపి.హెచ్.బి లో ఉన్న కళాశాలను సైతం యాజమాన్యం మూసివేసింది. తమ సర్టిఫికెట్లతోపాటు తాము కట్టిన డబ్బులను ఇప్పించి న్యాయం చేయాలని పోలీసులను కోరుతున్నారు విద్యార్థులు. ఇలాంటి తప్పుడు పత్రాలతో కళాశాలలను పెట్టి విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా విద్యార్థుల నుండి 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసింది యాజమాన్యం. గత ఆరు రోజులుగా విద్యార్దులు ఆందోళన చేపడుతున్నారు. కూకట్ పల్లి కేపి.హెచ్.బి కాలనీ, అమీర్పేట్ మెహిదీపట్నంలో కళాశాలలు యాజమాన్యం ఓపెన్ చేసింది. పోలీసులు ఇప్పటికే కళాశాలల పైన కేసులు నమోదు చేసారు.