సిరా న్యూస్,యాదాద్రి;
ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులకు దర్శనమివ్వరున్నారు.శనివారం ఉదయం 6:15 నిమిషములకు ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని ఆలయ ఈవో రామకృష్ణారావు తెలిపారు. వేలాదిగా భక్తులు తరలివస్తారని అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందనితెలిపారు ఉత్తర ద్వార దర్శనం ద్వారా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకునేందుకు రాష్ట్రంలోని ముగ్గురు మంత్రాలతో పాటు ఉన్నతాధికారులు కూడా రానున్నట్లు తెలిపారు ఉదయం నుండిసాయంకాలం నాలుగు గంటల వరకు భక్తులందరికీ ఉత్తర ద్వార దర్శనాన్ని అనుమతించడం జరుగుతుందని భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునేందుకు ఏర్పాటు చేస్తున్నామనిరామకృష్ణారావు తెలిపారు