తీవ్ర గాయలతో ఆసుపత్రికి తరలింపు
సిరా న్యూస్,మేడ్చల్;
మేడ్చల్ జిల్లా చర్లపల్లి డి విజన్ పరిధి ఇసి నగర్ కాలనీ లోని మహిళ పై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చడం స్థానికులను భయందోళనకు గురించేసింది. తీవ్ర గాయాలు కావడం తో మహిళ ను ఆసుపత్రికి తరలించారు. ఆరుబయట మొక్కలకు నీరుపోస్తున్న సమయంలో పిచ్చికుక్క దాడిచేసి 16చోట్ల కరవడంతో పరిస్థితి విషమంగా మారింది. . బయటికి వెళ్లాలన్నా జనాలు బయపడుతున్నారు. సంఘటనలు జరిగిన తరువాత కానీ జి హెచ్ ఎమ్ సి అధికారులు స్పందిస్తున్నారని ముందు జాగ్రత్త చర్యలు లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. పిచ్చికుక్కల బారినుండి జనాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.